సినీ ఇండస్ట్రీపై మహిళా కమిషన్ సీరియ‌స్‌

సినీ ఇండస్ట్రీపై మహిళా కమిషన్ సీరియ‌స్‌

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సినీ పరిశ్రమకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కొన్ని సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్, మహిళలను కించపరిచే విధమైన చిత్రీకరణపై ఫిర్యాదులు అందాయని కమిషన్ వెల్లడించింది. అభ్యంత‌ర‌క‌ర సీన్లు కంటిన్యూ చేస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు.

సినిమా అనేది సమాజంపై గొప్ప ప్రభావం చూపించే మాధ్యమం అని పేర్కొన్న మహిళా కమిషన్, మహిళలను అవమానించే కంటెంట్ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా హెచ్చరించింది.

సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత అని గుర్తుచేశారు. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చని, ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment