తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను బుధవారం ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3,04,965 కోట్లుగా ఉండగా, అందులో రెవెన్యూ మూలధనం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంటుందని తెలిపారు. బడ్జెట్‌లో అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి రూ.40 వేల కోట్లకు పైగా కేటాయించారు.
శాఖల వారీగా కేటాయింపులు..
వ్యవసాయ శాఖ – రూ.24,439 కోట్లు
పశు సంవర్థక శాఖ – రూ.1,674 కోట్లు
పౌర సరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
విద్యా శాఖ – రూ.23,108 కోట్లు
కార్మిక శాఖ – రూ.900 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా, శిశు సంక్షేమ శాఖ – రూ.2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
చేనేత రంగం – రూ.371 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
పరిశ్రమలు – రూ.3,527 కోట్లు
ఐటీ రంగం – రూ.774 కోట్లు
విద్యుత్ శాఖ – రూ.21,221 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ – రూ.12,393 కోట్లు
పురపాలక శాఖ – రూ.17,677 కోట్లు
నీటి పారుదల శాఖ – రూ.23,373 కోట్లు
రహదారులు, భవనాలు శాఖ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
క్రీడా రంగం – రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణ శాఖ – రూ.1,023 కోట్లు
దేవాదాయ శాఖ – రూ.190 కోట్లు