మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఇదే రోజున మంచు మనోజ్ నటిస్తున్న ‘భైరవం’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇప్పటికే మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్ మధ్య ఉన్న విభేదాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్న సమయంలో, రెండు సినిమాలు ఒకేసారి రావడం సినిమాప్రేమికులకే కాదు, మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్‌కూ మేటర్ ఆఫ్ డిబేట్ అయ్యింది. వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో చూడాలి.
భైరవం సినిమాలో మంచు మనోజ్‌తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్నారు. అటు కన్నప్పలోనూ భారీ తారాగణం కనిపిస్తోంది. మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ కన్నప్పలో కీలక పాత్రల్లో నటించారు. మరి ఎవరి సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించగలదో వేచిచూడాల్సిందే.