టర్కీలోని బోలు ప్రావిన్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి ఓ స్కీ రిసార్ట్ హోటల్‌లో మంటలు చెలరేగి మొదట 10 మంది మృతిచెందారు. ప్రమాదం మరింత పెద్దదిగా మారింది. మంటలు వ్యాపించడంతో మృతుల భారీగా పెరిగిందని, అగ్నిప్రమాదంలో 66 మందికి పైగా మృతిచెందినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 51 మంది గాయపడ్డారని టర్కీ ఆరోగ్య మంత్రి అలీ యర్లికాయ వెల్లడించారు.
స్కీ రిసార్ట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం అందరినీ తీవ్రంగా కలచివేసిందని ఆరోగ్య శాఖ మంత్రి అలీ యర్లికాయ ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మంటలు ఎలా చెలరేగాయి అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుండగా, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.