తెలంగాణలో నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 6,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లా బోనకల్ గురుకుల స్కూలులో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, గత పదేళ్లుగా BRS ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా విద్యావ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 11 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మరింత ఉద్యోగావకాశాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.