నేపాల్‌లో భూకంపం.. 36 మంది మృత్యువాత‌, వీడియో వైర‌ల్‌

నేపాల్‌లో భూకంపం.. 36 మంది మృత్యువాత‌, వీడియో వైర‌ల్‌

నేపాల్-టిబెట్ సరిహద్దులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో చైనా, భారతదేశం, భూటాన్ మరియు బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు వ‌చ్చాయి. ఈ ఘోరమైన భూకంపంలో నేపాల్‌లో 36 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ప‌లు భ‌వ‌నాలు నేల‌కూలాయి. మంగళవారం ఉదయం 6:38 గంటలకు భూకంపం సంభవించింది, లుబుచే ప్రాంతానికి 93 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.

మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో భ‌యంతో జ‌నం ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ ఘోర ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతిచెందారు, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. భూకంపం ప్రభావంతో నేపాల్, భారత్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. చైనాలో ఈ భూకంప తీవ్రత 6.9గా నమోదు కాగా, జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భారత్‌లో ప్రభావం..
నేపాల్‌లో జరిగిన ఈ భూకంపం ప్రభావం భారత్‌లోని పలు ప్రాంతాలను కూడా తాకింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. బీహార్‌లోని పాట్నాతో పాటు పలు జిల్లాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూప్రకంపనల కారణంగా ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment