కాలిఫోర్నియాలో కుప్ప‌కూలిన చిన్న విమానం

కాలిఫోర్నియాలో కుప్ప‌కూలిన చిన్న విమానం

ఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫులర్టన్ పట్టణంలో వాణిజ్య భవనంపై ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఇటువంటి సంఘటనలు భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటీవ‌ల బ్యాంకాక్‌కు చెందిన ఓ విమానం ఎయిర్‌పోర్టులో కుప్ప‌కూల‌డంతో 179 మంది మృత్యువాత‌ప‌డ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment