అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 OTT ప్లాట్‌ఫార్మ్‌లను బ్లాక్ చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం IT నిబంధనల ఉల్లంఘనపై తీసుకున్న కఠిన చర్య అని వెల్లడించింది.
శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే) MP అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు IT సహాయ మంత్రి ఎల్. మురుగన్ సమాధానమిస్తూ.. 2024 మార్చి 14న 18 OTTలను బ్లాక్ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లు IT నిబంధనలను గణనీయంగా ఉల్లంఘించడంతో పాటు అసభ్య కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు.
డిజిటల్ మాధ్యమాలపై కట్టడి అవసరం
డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లు కూడా IT నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని మంత్రి హెచ్చరించారు. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు ప్రాథమిక నైతిక ప్రమాణాలను అనుసరించకపోతే, భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచించారు