టీ20 బ్లాస్ట్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రికార్డు!

17 ఏళ్ల ఫర్హాన్ అహ్మద్ అదరగొట్టాడు! టీ20 బ్లాస్ట్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రికార్డు!

ఇంగ్లండ్ (England) టీ20 బ్లాస్ట్‌ (T20 Blast)లో నాటింగ్‌హామ్‌షైర్ యువ స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ (Farhan Ahmad) సంచలనం సృష్టించాడు. శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జ్ (Trent Bridge) వేదికగా లంకాషైర్‌ (Lancashire)తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల ఫర్హాన్ అహ్మద్ హ్యాట్రిక్ (Hat-Trick) వికెట్ల (Wickets)తో చెలరేగిపోయాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో బౌలింగ్ చేసిన ఫర్హాన్, ఆఖరి మూడు బంతుల్లో వరుసగా ల్యూక్ వుడ్, టామ్ ఆస్పిన్‌వాల్, మిచెల్ స్టాన్లేలను పెవిలియన్‌కు పంపాడు.

టీ20 క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున తొలి హ్యాట్రిక్
ఈ హ్యాట్రిక్‌తో ఫర్హాన్ అహ్మద్ ఖాతాలో తొలి హ్యాట్రిక్ చేరింది. అంతేకాకుండా, టీ20 క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌ (Nottinghamshire)షైర్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అతడు రికార్డు సృష్టించాడు. ఈ ఫర్హాన్ మరెవరో కాదు, ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ తమ్ముడే.

గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కూడా ఫర్హాన్ ఇంగ్లండ్ తరఫున ఆడాడు. లంకాషైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ యువ సంచలనం ఇప్పటికే నాటింగ్‌హామ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే 7 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

మ్యాచ్ వివరాలు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ 126 పరుగులకు ఆలౌట్ అయింది. నాటింగ్‌హామ్ బౌలర్లలో ఫర్హాన్‌తో పాటు మోంట్‌గోమేరీ, ప్యాటర్సన్-వైట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని నాటింగ్‌హామ్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment