బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. 150 వెహికిల్స్ ద‌గ్ధం

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. 150 వెహికిల్స్ ద‌గ్ధం

క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగళూరు(Bangalore) నగరంలోని శ్రీరామపుర స‌మీపంలో భారీ అగ్ని ప్ర‌మాదం (Fire Accident) సంభ‌వించింది. పార్కింగ్ ప్లేస్‌ (Parking Place)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగ‌డం పార్కింగ్ ప్లేస్‌లోని 150కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పోలీసులు (Police) ఒక పార్కింగ్ స్థలంలో ఉంచారు. అయితే బుధ‌వారం ఉద‌యం అక్కడ అక‌స్మాత్తుగా మంటలు చెలరేగి, వేగంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంలో పోలీసులు సీజ్ చేసిన వాహ‌నాలు అగ్నికి ఆహుత‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయంతో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ప్ర‌మాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment