బాలకృష్ణతో పవన్‌ పోరు.. వార్‌ తప్పదు

Pawan's fight with Balakrishna... War is inevitable

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్‌ 25న పవన్‌ కల్యాణ్‌ (ఓజీ) (Pawan Kalyan – OG), బాలకృష్ణ (అఖండ 2) (Balakrishna – Akhanda 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద మొదటిసారి పవన్‌తో బాలయ్య పోటీ పడనున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌ (Mega Fans), నందమూరి ఫ్యాన్స్‌ (Nandamuri Fans) మధ్య మరోసారి బాక్సాఫీస్‌ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాహో'(Saaho) సినిమా తర్వాత ఆరేళ్లకు దర్శకుడు సుజిత్‌ (Sujith) తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ'(OG).. పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఈ చిత్రం రానుంది. దీంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్‌ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు. మరోవైపు అఖండకు సీక్వెల్‌గా బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో అఖండ2 రానుంది. ఇప్పుడు రెండు సినిమాలు ఒకేరోజున విడుదల కానున్నట్లు ప్రకటన రావడంతో కలెక్షన్స్‌ పరంగా ఇద్దరికీ నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్‌ చరిత్రలో భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి.

‘ఓజీ’ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్‌ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పవన్‌ కల్యాణ్‌ కొంత కాలంగా ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. దీంతో మొదట అనుకున్న బడ్జెట్‌ కాస్త పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఓజీ నిర్మాణం కోసం రూ. 250 కోట్లు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు అఖండ2 కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం కూడా రూ. 200 కోట్లతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇలా అత్యంత బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్‌ విషయంలో ఇబ్బందులు రావచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment