జొమాటోకు షాక్.. కీలక అధికారి రాజీనామా

జొమాటోకు షాక్.. కీలక అధికారి రాజీనామా

Summarize with AI

ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) టీమ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న సీవోవో (కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్) రిన్షుల్ చంద్ర (Rinshul Chandra) తన పదవికి రాజీనామా (Resigned) చేశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అభిరుచులు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త అవకాశాల వెతకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జొమాటో సీఈవో(CEO) దీపిందర్ గోయల్‌ (Deepinder Goyal) కు రిన్షుల్ చంద్ర లేఖ రాశారు. “ఇది ఒక కష్టతరమైన నిర్ణయం. కానీ నా భవిష్యత్తు దిశలో కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు. రిన్షుల్ చంద్ర రాజీనామా నేపథ్యంలో జొమాటోలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాల్సి ఉంది.

స్టాక్ మార్కెట్‌లో మొద‌లైన అల‌జ‌డి జొమాటోను కూడా భారీగా న‌ష్టాల్లో ముంచేసింది. షేర్లు భారీగా ప‌డిపోయాయి. హెచ్చుత‌గ్గులు మామూలే అయిన‌ప్ప‌టికీ, కంపెనీలో కీల‌కంగా ఉన్న వ్య‌క్తి రిన్షుల్ చంద్ర రాజీనామా చేయ‌డంతో జొమాటో షాక్‌కు గురైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment