---Advertisement---

ద‌మ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖ‌మంత్రికి భూమ‌న స‌వాల్‌

ద‌మ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖ‌మంత్రికి భూమ‌న స‌వాల్‌
---Advertisement---

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు తిరుప‌తి జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ద‌మ్ముంటే నిరూపించాలంటూ మంత్రి ఆనంకు భూమ‌న స‌వాల్ విసిరారు.

స‌వాల్‌కు సిద్ధ‌మా..
ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు తొక్కిస‌లాట క్ష‌త‌గాత్రుల‌కు డ‌బ్బు క‌వ‌ర్లు ఇచ్చి అధికార పార్టీని తిట్టించార‌ని మంత్రి ఆనం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆనం వ్యాఖ్య‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తూ, “మేము బాధితులకు డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించాం అనుకుంటే, సీసీ కెమెరా రికార్డులు ఉన్నాయి క‌దా.. వాటి ద్వారా నిరూపించాలి. అది చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయండి” అని మంత్రి ఆనంకు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స‌వాల్ విసిరారు.

క్ష‌త‌గాత్రుల‌కు అవ‌మానం..
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తమపై చేసిన ఆరోపణలు దారుణమని, నిజానికి ఆయన నిర్వాకం వల్ల ఆరు మంది మరణించారని భూమన ఆరోపించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించకుండా, వారికి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి, వాటిని రాజకీయాలకు వాడుకోవడం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌తో క్షతగాత్రులను అవమానించారని, బాధితుల పట్ల కనీసం సానుభూతి చూపకుండా నోటికొచ్చిన‌ట్లుగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

జ‌గ‌న్‌ను అడ్డుకునే కుట్ర..
తొక్కిస‌లాట మృతిచెందిన వారి కుటుంబాల‌ను, క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వైఎస్ జ‌గ‌న్ ఆస్ప‌త్రికి వెళ్తుంటే ఆయ‌న పర్యటనను అడ్డుకునేలా కుట్ర జరిగిందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని ట్రాక్టర్లతో అడ్డుకోవడం దారుణం కాదా? అని భూమ‌న‌ ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment