ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ మరో మైలు రాయిని అందుకుంటోంది. త్వరలోనే కొత్త ఫీచర్ ద్వారా మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుగా షేర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది.
ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలి?
వాట్సప్‌లో స్టేటస్ పోస్ట్ చేసే సమయంలో ఫేస్‌బుక్ స్టోరీ, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఆప్షన్లు కనిపిస్తాయి. ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీరు మీ స్టేటస్‌ను అదే సమయంలో మూడు యాప్లలో షేర్ చేయవచ్చు. అవసరమైతే ఎప్పుడైనా ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.
ఈ సరికొత్త ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. వాట్సప్ యూజర్స్ రోజువారీ స్టేటస్‌లు మరింత మందిని చేరుకోవడం కోసం ఇది ఒక మంచి మార్గం అవుతుందని నెటిజన్స్ భావిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ యూజర్స్‌కు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తుంది.