హోండా-నిస్సాన్ విలీనం.. వాహన రంగంలో మ‌రో సంచ‌ల‌నం

హోండా-నిస్సాన్ విలీనం.. వాహన రంగంలో మ‌రో సంచ‌ల‌నం

ప్రపంచ వాహన రంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్ర‌ఖ్యాత‌ హోండా- నిస్సాన్ కంపెనీలు పరస్పరం విలీనం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ విలీనం ద్వారా అమ్మకాల పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అవతరించనుంది.

ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లో పోటీ పెరగనుంది. టెస్లా, చైనా కంపెనీ బీవైడీ వంటి ప్రధాన ప్రత్యర్థులను ఎదుర్కొనడంలో ఈ విలీనం కీలకంగా మారనుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. మిత్సుబిషి మోటార్స్ కూడా ఈ విలీనానికి భాగస్వామిగా చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

2026 నాటికి విలీనం పూర్తి..
హోండా ప్రెసిడెంట్ తోషిహిరో మిబే వివ‌రాల ప్రకారం.. హోండా ఈ జాయింట్ హోల్డింగ్ కంపెనీకి నాయకత్వం వహించనుంది. నిస్సాన్‌కు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న అనుభవం హోండాకు కొత్త తరహా హైబ్రిడ్, ఈవీ వాహనాల అభివృద్ధిలో తోడ్పడుతుంది. 2025 జూన్ నాటికి చర్చలు పూర్తి చేసి, 2026 ఆగస్టు నాటికి ఈ విలీనం పూర్తవుతుందని వారు ప్ర‌క‌టించారు. ఈ విలీనం ద్వారా రూ. 4 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్లు) విలువైన సంస్థ అవతరించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment