గ్లోబల్ టెక్ (Global Tech) దిగ్గజం గూగుల్ (Google)లో మరోసారి సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. టెక్నాలజీ పరంగా ఎంత గొప్ప సంచలనాలను సృష్టించగలదో.. ఉద్యోగుల విషయంలోనూ గూగుల్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా గూగుల్ తమ గ్లోబల్ బిజినెస్ యూనిట్ (Global Business Unit)లో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉద్యోగులను (Employees) తొలగించింది (Laid off). ముఖ్యంగా విక్రయాలు (Sales), భాగస్వామ్యాల (Partnerships) విభాగాల్లో పనిచేసే ఉద్యోగులే ఈ కోతకు గురయ్యారు.
ఈ చర్యతో గూగుల్ మున్ముందు వ్యూహాలకు అనుగుణంగా వ్యయ నియంత్రణకు మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది. సంస్థ వృద్ధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో నిర్వహణా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయం ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా గూగుల్ సహా అనేక టెక్ సంస్థలు ఖర్చుల తగ్గింపు కోసం ఉద్యోగాల్లో కోతలు చేస్తుండటం గమనార్హం.