దిగ్గజ కంపెనీ సీఈఓ రాజీనామా.. కొత్త నాయకత్వానికి మార్గం

దిగ్గజ కంపెనీ సీఈఓ రాజీనామా.. కొత్త నాయకత్వానికి మార్గం

Summarize with AI

ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ కేటీఎం సీఈఓ స్టీఫన్ పియరర్ రాజీనామా చేశారు. ఆయన 30 సంవత్సరాలపాటు సంస్థకు సేవలందించి, దానిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రాజీనామా అనంతరం సంస్థ కొత్త సీఈఓగా గాటైడ్ న్యూమీస్టర్‌ను నియమించింది. అయితే, స్టీఫన్ పూర్తిగా తప్పుకోకుండా, కో-సీఈఓగా తన ఆలోచనలు, అనుభవం పంచుకుంటారని ప్రకటించారు. కేటీఎం, హస్క్వర్నా, గ్యాస్ గ్యాస్ వంటి ప్రముఖ బ్రాండ్ల మాతృసంస్థ అయిన ‘పియరర్ మొబిలిటీ’లో ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు.

ఈ కీలక మార్పులతో కేటీఎం సంస్థ కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేస్తూ, మరింత వైవిధ్యమైన ప్రణాళికల కోసం సిద్ధమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment