కొత్త సంవత్సరం (2025 జనవరి 1) నుంచి పాత ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిపివేయబడనున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ (Android KitKat) ఓఎస్‌తో పనిచేసే ఫోన్లు, అలాగే iOS 15.1, అంత కంటే పాత వెర్షన్లపై పనిచేసే ఐఫోన్లు ఈ మార్పు ప్రభావాన్ని ఎదుర్కొననున్నాయి.
వాట్సప్ ప్రకటన ప్రకారం.. సైబర్ మోసాలను నివారించేందుకు, పాత ఫోన్లలో ఉన్న భద్రతా లోపాల దృష్ట్యా వాటిల్లో వాట్సప్ సేవలు కొనసాగించలేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. 9-10 ఏళ్ల క్రితం విడుదలైన ఫోన్లు.. నేటి ఆధునిక భద్రతా ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయని వాట్సప్ తెలిపింది.
ఈ జాబితాలో మీ ఫోనూ ఉందా?
పాత ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ వెర్షన్ ఉన్న పరికరాలు వాడుతున్న వారు తమ ఫోన్‌ను అప్డేట్ చేయడం లేదా కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అవసరం. ఇందువల్ల కొత్త భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. వాట్సప్ సేవలను నిరంతరంగా ఉపయోగించుకోవచ్చు.