---Advertisement---

జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక

జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక
---Advertisement---

జియో వినియోగదారులకు స్కామ్ కాల్స్‌పై ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. +91 మినహా ఇతర ప్రిఫిక్సుతో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌కు జాగ్రత్త వహించాలని సూచించింది. ఇటీవల ఐఎస్ఓ నంబర్లతో మిస్డ్ కాల్స్ వచ్చే ఘటనలు పెరిగిపోయాయి. ఈ నంబర్లకు కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి రూ.200-300 వరకు ఛార్జ్ అవుతోందని జియో వెల్లడించింది. స్కామ్ కారణంగా భారీ ఆర్థిక నష్టం ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

సురక్షితంగా ఉండే సూచనలు
ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవాలని జియో సూచించింది. అనుమానాస్పద నంబర్లకు కాల్ చేయడం, తిరిగి కాల్ చేయడం తగ్గించాలనీ విజ్ఞప్తి చేసింది. ఈ సూచనలను పాటించడం ద్వారా వినియోగదారులు స్కామ్‌ల బారినపడకుండా ఉండగలరని జియో త‌న వినియోగ‌దారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment