---Advertisement---

కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి.. ప‌తనానికి కార‌ణాలేంటి?

కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి.. ప‌తనానికి కార‌ణాలేంటి?
---Advertisement---

భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్ట‌ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం యూస్ డాల‌ర్‌తో పోలిస్తే మ‌న 85 రూపాయ‌ల‌తో స‌మానం. ఇది దేశ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విదేశీ బ్యాంకులు భారీగా డాలర్లను కొనుగోలు చేయడం, దిగుమతుల అవసరాలు పెరగడం వంటి అంశాలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. అంతేకాకుండా, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కలగడం వంటి పరిణామాలు కూడా రూపాయి పతనాన్ని మరింత వేగవంతం చేశాయి.

డాలర్ బలపడడం, ఆర్థిక ప్రభావం
అంతర్జాతీయంగా డాలర్ బలపడుతుండటం రూపాయిపై అధిక ఒత్తిడిని కలిగిస్తోంది. దేశీయ దిగుమతుల వ్యయాలు పెరగడంతో పాటు, రూపాయి బలహీనత దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment