---Advertisement---

పుష్పలా తగ్గేదేలే అంటోన్న దినేశ్ కార్తీక్

పుష్పలా తగ్గేదేలే అంటోన్న దినేశ్ కార్తీక్
---Advertisement---

భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 (SA20) టోర్నీలో పాల్గొనబోతున్నారు. ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పార్ల్ రాయల్స్ జట్టు సోషల్ మీడియాలో షేర్ చేసింది. “మొదటిసారి స్పేస్‌లోకి వెళ్లిన భారతీయుడు, ఫస్ట్ ఆస్కార్ గెలిచిన ఇండియన్, మొదటి నోబెల్ గ్రహీత, ఒలింపిక్స్‌లో తొలి గోల్డ్ మెడలిస్ట్‌గా గుర్తింపు పొందిన భారతీయుడు.. ఇప్పుడు SA20 ఆడుతున్న‌ తొలి భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్” అంటూ వీడియోలో చెప్పారు.

‘తగ్గేదేలే’ మేనరిజంతో ఆకట్టుకున్న కార్తీక్
వీడియోలో దినేశ్ కార్తీక్ ‘పుష్ప’ సినిమాలోని “తగ్గేదేలే” డైలాగ్ మేనరిజంతో అభిమానులను అలరించారు. ఈ ప్రోమోపై క్రికెట్ ప్రేమికుల నుంచి విశేష స్పందన వస్తోంది. దినేశ్ కేవలం ఆటలోనే కాకుండా, తన వ్యక్తిత్వంతో కూడా అందరిని ఆకర్షిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment