రిలయన్స్ బ్రాండ్స్ మాజీ CEO మృతి

రిలయన్స్ బ్రాండ్స్ మాజీ CEO మృతి

రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో(CEO) దర్శన్ మెహతా (Darshan Mehta) హ‌ఠాన్మ‌ర‌ణం (Sudden Demise) చెందారు. 64 ఏళ్ల మెహతా గుండెపోటు (Heart Attack) తో బుధవారం తుదిశ్వాస విడిచారు. దర్శన్ మెహతా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వ్యాపార వ్యవస్థాపకుడిగానే కాకుండా, ఆయన ఒక మిడ్-డిస్టెన్స్ రన్నర్, హిమాలయ పర్వతారోహకుడిగా కూడా ప్రత్యేకంగా నిలిచారు. గత నవంబర్ వరకు ఆయన RBL మేనేజింగ్ డైరెక్టర్‌ (Managing Director) గా పనిచేశారు. అనంతరం ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా మరణించడం కార్పొరేట్ వర్గాల్లో విషాదాన్ని కలిగించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment