టెస్లా రాకపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

టెస్లా రాకపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా (Tesla) భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నెటిజన్, టెస్లా భారత్‌లోకి రాగానే మహీంద్రా సంస్థ దీనికి పోటీగా ఎలా నిలబడతుందని ప్రశ్నించారు. దీనికి ఆనంద్ మహీంద్రా తన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ సమాధానం ఇచ్చారు.

అదే మా న‌మ్మ‌కం..
మహీంద్రా స్పందిస్తూ.. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని పేర్కొన్నారు. అప్పట్లో టాటా, సుజుకీ వంటి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలతో పోటీపడి తమ స్థానాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. “మా ఉత్పత్తులపై ఉన్న నమ్మకమే మాకు బలమైన ఆధారం. టెస్లా వచ్చినా అదే నమ్మకంతో ముందుకు సాగుతాం” అని మహీంద్రా చెప్పారు. అలాగే మార్కెట్లో పోటీ అనేది వ్యాపారానికి మేలు చేస్తుందని, ప్రజలు, వినియోగదారుల మద్దతుతో మహీంద్రా కూడా తనను తాను మరింత మెరుగుపరుచుకుంటుందని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment