సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆఫర్.. 30వ తేదీ మ్యాచ్‌పై నెటిజ‌న్ల ఆగ్ర‌హం

సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆఫర్.. నెటిజ‌న్ల ఆగ్ర‌హం

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టుకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ACA) నుంచి ఆసక్తికరమైన ఆఫర్‌ వచ్చింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)తో SRH కు వివాదం నడుస్తుండటంతో, ఆ జట్టుకు పన్ను మినహాయింపులు సహా ఇతర సహాయాలను అందించేందుకు ఏసీఏ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇందులో భాగంగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను విశాఖపట్నం వేదికగా నిర్వహించుకునే అవకాశాన్ని SRH కు ప్రతిపాదించినట్లు ఏసీఏ వెల్లడించింది. ప్రస్తుతం, ఈ ప్రతిపాదనపై సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పందన కోసం ఏసీఏ ఎదురు చూస్తోంది.

30వ తేదీ మ్యాచ్‌పై నెటిజ‌న్ల ఆగ్ర‌హం
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30వ తేదీన జరిగిన మ్యాచ్‌లో వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్మకాలు జరిపారు అంటూ ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. రూ.⁠300 పిజ్జా అమ్మితే అదికూడా తినే విధంగా లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ- సన్‌రైజర్స్ మ్యాచ్ సెకన్లు వ్యవధిలో టికెట్స్ హౌజ్ ఫుల్ బోర్డు పెట్టారు అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment