ఓటర్ జాబితా తన పేరు మాయం అవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి అవాక్కయ్యారు. దీంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయడానికి డెహ్రాడూన్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే, ఓటర్ జాబితాలో తన పేరు లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటనపై హరీష్ రావత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “16 ఏళ్లుగా నేను ఇక్కడ ఓటు వేస్తున్నాను. కానీ ఈసారి నా పేరే జాబితాలో లేదు. అధికారులను ప్రశ్నించినా వారు సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది ఓటర్ల హక్కులను ఉల్లంఘించడం” అని వ్యాఖ్యానించారు.
ఈ సంఘటనపై రాజకీయంగా విమర్శలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఈ రకమైన తప్పిదాలు ప్రజలలో అపనమ్మకం కలిగిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. అయినా మాజీ ముఖ్యమంత్రి పేరు మాయం అవ్వడం ఏంటని ముక్కునవేలేసుకుంటున్నారు.