రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.1.63 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యర్థించారు. ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ సమావేశం సందర్భంగా కిషన్ రెడ్డిని భట్టి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై చర్చ జరిగింది.
ప్రాజెక్టుల కోసం నిధుల వివరణ..
ORR-RRR రహదారుల నిర్మాణం కోసం రూ.45,000 కోట్ల నిధులు అవసరమని, మెట్రో విస్తరణకు రూ.24,269 కోట్ల మంజూరు అవసరమని చెప్పుకొచ్చారు. మూసీ పునరుజ్జీవ పనులు & సీవరేజ్ మాస్టర్ ప్లాన్ పనులు ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా చేర్చి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేంద్రం మద్దతు అవసరమని, ప్రాజెక్టుల పూర్తి ద్వారా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రమంత్రికి వివరించారు. కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.