బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. నటుడిగా ప్రతి ఏడాదికి ఒక సినిమాను చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, తన అసలైన కల ‘మహాభారత్’ వంటి భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడం అని పేర్కొన్నారు.
అమీర్ మాట్లాడుతూ.. “మహాభారత్‌ను ఒక గొప్ప విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందించి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి, కథలు చూపించాలనే నా ఉద్దేశం” అని చెప్పారు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ సాధన కోసం మరికొన్ని సంవత్సరాలు కృషి చేయాలని, నిర్మాతగా మరిన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అమీర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి.