నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకను సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కారణంగా అనంతపురంలో నిన్న జరగాల్సిన ఈవెంట్ రద్దు అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ అభిమానులు ఇప్పటికే వేడుక కోసం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మార్గాలను మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఈవెంట్‌తో పాటు, సినిమా విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ప్రీరిలీజ్ వేడుకలో వెల్లడించనున్నారు. అభిమానులు ఉత్సాహంగా వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.