వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గౌతమ్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు కొన్ని కీలక షరతులు విధించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సుప్రీం కోర్టు షరతు విధించింది. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఆధారాలు చెరిపివేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. ఇతర షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. షరతులు విధిస్తూ సుప్రీంకోర్టు గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.