సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో అటు అల్లు ఫ్యాన్స్, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
డిసెంబర్ 4వ తేదీన పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారస్థితి ఆస్పత్రిలో చేరి గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.