తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్యారడైజ్ నుంచి తాడ్బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకు 23 కి.మీ.ల కారిడార్ మరియు JBS నుంచి కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్పేట్ వరకు 22 కి.మీ.ల కొత్త కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ప్రాజెక్ట్లు వేగంగా ముందుకు వెళ్లేలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను వెంటనే ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదికలు (DPR) సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. మెట్రో విస్తరణతో నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి.
పవన్ను టీడీపీ ఎదగనివ్వదు – కాపు నేత సంచలన వ్యాఖ్యలు