---Advertisement---

య‌ల్ల‌మంద‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. ల‌బ్ధిదారుల పింఛ‌న్ల పంపిణీ

య‌ల్ల‌మంద‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. ల‌బ్ధిదారుల పింఛ‌న్ల పంపిణీ
---Advertisement---

పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప‌ర్య‌టించారు. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. వారి క‌ష్టాలు అడిగి తెలుసుకొని, శార‌మ్మ కూతురుకు నీట్‌ కోచింగ్ ఇప్పించాలని, కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.3 లక్షల రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మ‌రో ల‌బ్ధిదారు ఏడుకొండలు కుటుంబ సభ్యులను చంద్ర‌బాబు కలుసుకుని వారి ఇంట్లో స్వయంగా కాఫీ కలిపి అందజేశారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. ప్రతి పేద కుటుంబం మంచి జీవితం గడపాలని తన లక్ష్యమని తెలిపారు. గత ఐదేళ్లలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నార‌ని, ఇప్పుడు వారికి సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. పింఛన్లు ఇంటి వద్దనే అందించాలనీ, ఆఫీసుల్లో ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ సేవల్లో డ్రోన్లను వినియోగించి మరింత వేగంగా సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజల కోసం పనిచేయడమే త‌న‌ ధ్యేయం. ఐదు కోట్ల మంది ప్రజలే త‌న‌ హైకమాండ్ అని చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటి సమస్యను వ్యక్తిగతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేయడమే తన ప్రాధాన్యత అని చంద్రబాబు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment