బాలయ్య అభిమానులు ఏం చేసినా అదొక వైరటీగా ఉంటుంది. ఎవరైనా అభిమాన హీరోకి పాలతోనో, పెరుగుతోనో, లేక పూలతోనో అభిషేకం చేస్తారు. కానీ బాలయ్య అభిమానుల తీరు చూస్తే ఇదేం పిచ్చి అభిమానం అని అనకుండా మానరు. టాలీవుడ్ నటుడు బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అతని సినిమా అంటే అభిమానులకు పండగ లాంటిది.
ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమా విడుదల సందర్భంగా, రాయలసీమలోని బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లకు పొట్టేలును బలిచ్చారు. కానీ, వీటి కంటే మరింత అద్భుతమైన ఘటన అగ్రదేశం అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని బాలకృష్ణ కమ్ టీడీపీ అభిమానులు పచ్చ కండువాలు ధరించి.. ఆయన కటౌట్‌కు మాన్షన్ హౌస్ మందు బటిళ్లతో అభిషేకం చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన బ్రాండ్ మ్యాన్‌షన్ హౌస్ అని బాలయ్య పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అతని బ్రాండ్‌తోనే అభిషేకం చేయడం బాలయ్యపై ఉన్న అభిమాన పిచ్చికి పరాకాష్ట అని అంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది దృష్టిని ఆకర్షస్తున్నాయి.. బాలయ్యకు తగ్గట్టే ఉన్నారు ఆయన అభిమానులు కూడా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.