తెలుగు సినీ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సిబ్బంది ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలను మామ చంద్రశేఖర్ ఇంటికి తరలించారు. భద్రత కోసం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు, టమాటాలు రువ్వారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా, బన్నీ సిబ్బంది వారిని అడ్డుకోగా వాగ్వాదానికి దిగారు. ఇంట్లోని పూలకుండీలను ధ్వంసం చేశారు. దాటి ఘటన తెలిసిన వెంటనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ బన్నీ ఇంటికి చేరుకున్నారు.
కాగా, మృతిచెందిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బన్నీ ఇంటిపై దాడి ఘటనలో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు.