టీ20 వరల్డ్‌కప్ 2026 లీగ్ (T20 World Cup league) దశ ముగియడంతో శనివారం (ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఈసారి పసికూన జింబాబ్వే (Zimbabwe) అద్భుత ఆటతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ సూపర్-8కు దూసుకెళ్లింది. బలమైన ఆస్ట్రేలియాను (Australia) ఓడించడం గాలివాటం అనుకున్నవారికి, ఆతిథ్య శ్రీలంకను (Sri Lanka) కూడా చిత్తు చేసి తమ సత్తా చాటింది. ఈ విజయాల్లో యువ బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) కీలక పాత్ర పోషించి టోర్నీలో హాట్ టాపిక్‌గా మారాడు.
మూడు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారైనా ఔట్ కాకుండా బెన్నెట్ 175 పరుగులు నమోదు చేశాడు. ఒమాన్‌పై 48, ఆస్ట్రేలియాపై 64, శ్రీలంకపై 63* రన్స్ చేసి జట్టును విజయాలకు చేరువ చేశాడు. ఒత్తిడిలోనూ కూల్‌గా ఆడుతూ చివరివరకు నిలబడే తీరు అతడిని టోర్నీలో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడిగా నిలబెట్టింది. ఇదే ఫామ్ కొనసాగితే జింబాబ్వేకు సెమీస్ దూరం కాదనే అంచనాలు వినిపిస్తున్నాయి.







