ప‌వ‌న్‌కు ఎన్నిక‌ల ఆయుధంగా సుగాలి ప్రీతి కేసు

ప‌వ‌న్‌కు ఎన్నిక‌ల ఆయుధంగా సుగాలి ప్రీతి కేసు

సుగాలి ప్రీతి (Sugali Preeti) కేసును 2024 ఎన్నిక‌ల (Elections) ముందు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ప్ర‌చార ఆయుధంగా (Weapon) వాడుకున్నార‌ని వైసీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణ్ (Varudu Kalyan) ఆరోపించారు. క‌ర్నూలులో సుగాలి ప్రీతి త‌ల్లిదండ్రులు పార్వ‌తీ దేవి, రాజునాయ‌క్‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వ‌రుదు క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. 2017 ఆగస్టు 19న గిరిజన బాలికపై జరిగిన అత్యాచారం, హత్యకు ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదన్నారు. ఈ ఘటన చంద్రబాబు (Chandrababu) హయాంలో జరిగినప్పటికీ ఆయన ప్రభుత్వం బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కార్‌లో సుగాలి ప్రీతి త‌ల్లిదండ్రుల‌కు 5 ఎక‌రాల పొలం, ఇంటి స్థ‌లం, ప్ర‌భుత్వ ఉద్యోగం ద‌క్కాయ‌న్నారు.

అదే కేసును 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచార ఆయుధంగా వాడుకున్నారని కళ్యాణి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును పట్టించుకోలేదని మండిపడ్డారు. రుషికొండ భవనాలను (Rushikonda Buildings) పరిశీలించడానికి సమయం దొరికింది కానీ, సుగాలి ప్రీతి కేసుపై శ్ర‌ద్ధ చూప‌డానికి పవన్ కళ్యాణ్ టైమ్ లేదా అని ప్ర‌శ్నించారు.

ముంబై నటి జ‌త్వానీ కేసులో కూటమి ప్రభుత్వం చూపిన శ్రద్ధ, గిరిజన బాలిక కేసులో ఎందుకు కనబడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేష్‌లపై కూడా కళ్యాణి విమర్శలు గుప్పించారు. లోకేష్(Lokesh) చేతిలోని “రెడ్‌బుక్”(Red Book)లో సుగాలి కేసు నిందితుల పేర్లు లేవా అని ఆమె నిలదీశారు. ఈ కేసుపై నిర్లక్ష్యం విడనాడి వెంటనే సీబీఐ లేదా సిట్ విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment