స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తెగువ చూపి సత్తా చాటిన వైసీపీ (YCP) ప్రజాప్రతినిధులను (Public Representatives) చూసి గర్వపడుతున్నానని వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ (YCP Central Office) లో ఇటీవల స్థానిక సంస్థల్లో నెగ్గిన వైసీపీ ప్రజాప్రతినిధులను వైఎస్ జగన్ అభినందించారు. మొన్న జడ్పీ (ZP), ఎంపీపీ (MPP), వైస్ ఎంపీపీ (Vice MPP), కో ఆప్షన్ సభ్యులు (Co-Option Members), ఉప సర్పంచ్ (Deputy Sarpanch) స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేక ఎన్నికలు వాయిదా వేశారన్నారు. ఎన్నికలు జరిగిన 50 స్థానాల్లో 39 చోట్ల వైసీపీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలిచారని అభినందించారు. ఏళ్లకు ఏళ్లు అనుభవం ఉందని, ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్దీ జ్ణానం రెండూ లేవని వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. బలం లేనప్పుడు హుందాగా పోటీకి దూరంగా ఉండాల్సిందిపోయి భయపెట్టి, మభ్యపెట్టి, ప్రలోభపెట్టి దక్కించుకుంటానని చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు న్యాయమేనా? అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
తినే కంచం తీసేశాడు..
చంద్రబాబు (Chandrababu) సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. మోసాలుగా మిగిలాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికీ చంద్రబాబు బాండ్లు పంపించి ప్రలోభపెట్టి.. ఎన్నికల్లో నెగ్గాడన్నారు. పథకాల గురించి అడిగితే కేసులతో భయపెట్టాలని చూస్తున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక బటన్ నొక్కే పరిస్థితి ఉండేదని, నాలుగువేళ్లు నోట్లోకి పోయేవన్నారు. చంద్రబాబు వచ్చాక నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం కాదు.. తినే కంచం కూడా తీసేశాడన్నారు. స్కూళ్లు (Schools) నాశనం, ఇంగ్లిషు మీడియం (English Medium) గాలికెగిరిపోయింది. నాడు నేడు (Nadu-Nedu) పనులు ఆగిపోయాయి. టోఫెల్ క్లాసులు తీసేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ ఆగిపోయింది.
జగన్ 2.0లో అలా జరగదు..
కార్యకర్తలు కష్ట సమయంలో ఉన్నారని, ఈ సమయంలోనూ కార్యకర్తలు చూపిస్తున్న స్ఫూర్తికి, నిబద్ధతకు రుణపడి ఉంటానని వైఎస్ జగన్ అన్నారు. రాబోయే రోజులు వైసీపీవేనని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ అఖండ మెజారిటీ (Massive Majority) తో అధికారంలోకి వస్తుందని, ఈసారి వచ్చినప్పుడు జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడన్నారు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫెర్ట్ పెట్టాం కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చన్నారు. కానీ జగన్ 2.0 లో అలా జరగదని కార్యకర్తలకు మాట ఇచ్చారు. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత చేసి చూపిస్తానన్నారు.
ఆ మనిషి ఏమీ మారలేదు..
చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) మోసాలు (Frauds) క్లైమాక్స్ (Climax) కు చేరాయని వైఎస్ జగన్ అన్నారు. చాలామంది చంద్రబాబు మారి ఉంటాడని అనుకున్నారు కానీ, ఆయన మారలేదని చెబుతూ ఈ మధ్య కాలంలో పీ-4 అని కొత్త మోసం తీసుకొచ్చాడన్నారు. ”పీ-4 (P-4) విధానం అంటే సమాజంలో ఉన్న 20శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడంట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్ లో నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు” అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
సూపర్ సిక్స్ (Super Six), సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అంటే.. రాష్ట్రం అప్పులు రూ.10లక్షల కోట్లు అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ (Diversion Politics) చేస్తున్నాడని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఇటీవల చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించాడని, అందులో రూ.3.13 లక్షల కోట్లు 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఆయన చేసిన అప్పులేనన్నారు. కానీ, పథకాలు అమలు చేసే మనసు లేక రాష్ట్రం భయంకరంగా ఉందని చూపించాలని రూ.10 లక్షలు కోట్లు అని అబద్ధాలు చెబుతున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకో రెండు నెలలు అయితే అప్పు రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని కూడా చెబుతాడని వైఎస్ జగన్ సెటైర్లు వేశారు.








