వేద విద్యార్థుల మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

వేద విద్యార్థుల మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

రోడ్డు ప్ర‌మాదంలో వేద విద్యార్థులు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కర్ణాటక రాయ్‌చూర్‌ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన వేద‌ విద్యార్థులు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమానికి వెళ్తుండ‌గా, వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరమ‌న్నారు. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని వైఎస్ జ‌గ‌న్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment