యువ కథానాయకుడు తేజ (Teja) ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ‘హనుమాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తేజ, ఇప్పుడు తన తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’ (“Mirai”)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
పవర్ ఫుల్ పాత్రల్లో తేజ, మంచు మనోజ్
ఈ చిత్రంలో తేజ ఒక శక్తివంతమైన యోధుడి (Warrior’s) పాత్ర(Role)లో కనిపిస్తాడు. మానవజాతి భవిష్యత్తును నిర్ణయించే తొమ్మిది గ్రంథాలను కాపాడే యోధుడిగా అతని పాత్ర ఆకట్టుకోనుంది. మరోవైపు, మంచు మనోజ్ (Manchu Manoj) ఒక శక్తివంతమైన విలన్ పాత్ర (Villain Role)లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సినిమాలోని యాక్షన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని సూచించాయి. ముఖ్యంగా తేజ మరియు మంచు మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
రిలీజ్, ట్రైలర్ తేదీలు ఖరారు
‘మిరాయ్’ (Mirai) సినిమా(Movie) ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఇతర దేశీయ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ ట్రైలర్ (Trailer)ను ఆగస్టు 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.








