వరంగల్ (Warangal) నగరంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం (Heavy Rain) తీవ్ర ప్రభావం చూపింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై, అనేక ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎస్సార్ నగర్, సాకరాశి కుంట, హంటర్ రోడ్, కరీమాబాద్, ఎల్బీనగర్, శివనగర్ వంటి ప్రాంతాలు నీటమునిగి, నివాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి.
ఉరుసుగుట్ట (Urusugutta) ప్రాంతంలో భారీగా నీరు నిల్వ ఉండటంతో డీఆర్‌ఎఫ్ బృందాలు (DRF Teams) చురుకుగా సహాయక చర్యలు చేపట్టాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలుగురు డీఆర్‌ఎఫ్ బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) సిబ్బందితో కలిసి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.







