బాబు, ప‌వ‌న్ న్యాయం చేయ‌లేదు.. త‌ల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

బాబు, ప‌వ‌న్ న్యాయం చేయ‌లేదు.. త‌ల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

విజయవాడలోని వాంబే కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యాయం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ల చుట్టూ తిరిగి విసిగిపోయి, చివరికి త‌ల్లీకూతుళ్లు ఆత్మహత్యాయ‌త్నం చేశారు. వాంబే కాల‌నీకి చెందిన మ‌హిళ తమ కుటుంబ సభ్యుల వేధింపులకు తాళలేక త‌న కూతురును వెంట‌బెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీస్ల చుట్టూ తిరిగినా న్యాయం దక్కలేద‌ని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ కలహాలే కారణం
ఆ మహిళ భర్త శివ నాగరాజు, అత్తామామలు, మరిది నిత్యం తన పిల్లలను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడా న్యాయం కోసం వెళ్లినా, ఎవరికీ తన బాధ పట్టదని, ఎవరూ స్పందించలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి తన ప్రాణాల మీదకు వచ్చిందని, అందుకే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నామని ఓ వీడియోలో వెల్లడించారు.

సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఇప్పటివరకు అధికారుల స్పందన రాకపోవ‌డంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment