తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం..పంటలకు భారీ నష్టం

తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. మేఘాలు బీకర గర్జనలు, జోరున గాలి, మరోపక్క వర్షం బీభత్సం సృష్టించాయి. ఏపీ (Andhra Pradesh) లోని కృష్ణా, గోదావరి జిల్లాల్లో గాలివాన (Thunderstorm) బీభత్సాన్ని సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ తీగలు విరిగిపడ్డాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అకాల వర్షాలు ప్రజలను గజగజలాడిస్తున్నాయి.

ఈ గాలివానల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలకు (Crops) తీవ్ర నష్టం (Damage) ఏర్పడింది. రైతులు ఇప్పటికే పెట్టుబడులు వేసి పంటలు సాగు చేసిన దశలో వానలు మొదలవడం కలవరపెడుతోంది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న పంటలు గాలివాన ధాటికి దెబ్బతిన్నట్టు సమాచారం.

విజయవాడ (Vijayawada) నగరంలో కూడ భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రధాన రహదారులు నీట మునిగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment