సంచలనాత్మక దర్శకుడితో సూపర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌

సంచలనాత్మక దర్శకుడి తో సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి సినిమా..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఇటీవల లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ'(Coolie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, భారీ హైప్ కారణంగా అద్భుతమైన వసూళ్లను సాధించింది. తమిళనాడులో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘కూలీ’ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తదుపరి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే జ్ఞానవేల్, మారి సెల్వరాజ్, శివ, ఆదిక్ వంటి పలువురు దర్శకులు రజనీకి కథలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి.

నాగ్ అశ్విన్‌తో రజనీకాంత్ సినిమా?
ఇటీవల రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా రాబోతుందని తమిళ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ సినిమాను కమల్ హాసన్ బ్యానర్‌పై నిర్మిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

తాజా సమాచారం ప్రకారం, ఈ దర్శకులెవరూ కాకుండా మన తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ‘మహానటి’, ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన నాగ్ అశ్విన్, ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఒక కథను వినిపించినట్లు తెలుస్తోంది. ఆ కథ రజనీకి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమని చెప్పారని చెన్నై సినీ వర్గాలలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

‘వైజయంతి మూవీస్’ బ్యానర్‌లో?
అన్నీ కుదిరితే, ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నిర్మించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఖరారైతే, నాగ్ అశ్విన్ తన ‘కల్కి 2898 AD’ సినిమాను వాయిదా వేసే అవకాశం ఉందని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ వార్తలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment