చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌.. ఉత్తమ నటిగా సాయిప‌ల్ల‌వి

చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌.. ఉత్తమ నటిగా సాయిప‌ల్ల‌వి

చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. ఈ వేడుకలో ప్రముఖ నటి సాయిపల్లవి ‘అమరన్’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అదే సమయంలో, ‘మహారాజ’ చిత్రానికి విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికై అవార్డు ద‌క్కించుకున్నారు.

అభిమానులకు కృతజ్ఞతలు
అవార్డు అందుకున్న సాయిపల్లవి మాట్లాడుతూ, “ఇది నాకు ఎంతో గర్వకారణం. ఈ విజయానికి నా అభిమానులు, ముకుంద్ కుటుంబసభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య చేసిన సహకారం కారణమని చెప్పడం గౌరవంగా భావిస్తున్నాను” అని ఆమె అభిప్రాయపడ్డారు. సాయిపల్లవి ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకోవ‌డం ప‌ట్ల ఆమె ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment