‘ఆంధ్రా కింగ్’ కోసం రామ్ స్పెషల్ ట్రై!

ఆంధ్రా కింగ్ కోసం రామ్ స్పెషల్ ట్రై! ఇది భాగ్యశ్రీ కోసమేనా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆంధ్రా కింగ్’ (Andhra King) చుట్టూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్‌తో ఘన విజయం సాధించిన రామ్‌కి, తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్, ది వారియర్ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ట్రాక్‌ నుంచి కొంత వెనుకబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రాక్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రయోగం చేశాడు.

ఒక పాట (One Song)ను స్వయంగా రాయడం (Writing) రామ్ కెరీర్‌లో ఇదే మొదటిసారి. అద్భుతమైన లిరిక్స్‌తో పాట ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కానీ, ఈ పాట వెనుక వ్యక్తిగత కోణం ఉందన్న రూమర్స్ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. రామ్ తన కో-స్టార్ భాగ్యశ్రీ బోర్సే కోసం ఈ పాట రాశారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

సినిమా షూటింగ్ ప్రారంభం నుండి రామ్-భాగ్యశ్రీల మధ్య స్పెషల్ బాండ్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ షేర్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులూ చాలావరకు ఒకే తరహాలో ఉండటంతో అభిమానుల్లో సందేహాలు ఎక్కువయ్యాయి. “ప్రేమలో ఉన్నవాళ్లే ఇలాంటి పాటలు రాయగలరు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, రామ్ ఈ సినిమాలో ఓ పాట పాడనున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా, ఒక్కసారైనా మైక్ పట్టని రామ్, ఈసారి మాత్రం స్వయంగా గానం చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇది కూడా భాగ్యశ్రీ కోసం తీసుకున్న స్పెషల్ స్టెప్ కాదా? అంటూ అభిమానుల్లో ఊహాగానాలు పెరుగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment