నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయ‌నున్నారు. అనంత‌రం ప్ర‌జ‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళ్ల‌నున్నారు. విశాఖ‌లో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment