ఏపీ (AP)లో జరుగుతున్న వరుస ఘటనలు విద్యాశాఖ (Education Department) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు ఫుడ్‌పాయిజనింగ్ (Food Poisoning).. మరోవైపు విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగుల్లో(Bags) నాణ్యతాలోపం పిల్లలకు, తల్లిదండ్రులకు(Parents) ఆగ్రహం తెప్పిస్తోంది. గత నాలుగు రోజులుగా కల్తీ ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటనలు సంచలనం సృష్టిస్తుండగా, నెల రోజులకే స్కూల్ బ్యాగులు టైలర్ షాప్ వద్దకు చేరడం చర్చనీయాంశంగా మారింది. పిల్లలను హాస్టల్‌కు పంపించాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు నెల రోజులు కాకముందే చినిగిపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో నాణ్యమైన బ్యాగులు అందిస్తున్నామని ప్రకటించినప్పటికీ, విద్యార్థులకు అందించిన బ్యాగులలో క్వాలిటీ కనిపించలేదు. గత నెల 12వ తేదీ స్కూళ్ల స్టార్ట్ అవ్వగా, నెల కూడా తిరక్క ముందే బ్యాగులు స్టిచ్చింగ్ కోసం టైలర్ షాప్‌కి చేరడం సంచలనంగా మారింది. బ్యాగ్స్ జిప్పర్లు, స్టిచింగ్ దెబ్బతినడంతో విద్యార్థులు టైలర్ షాపులకు పరుగులు తీస్తున్నారని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్యాగుల క్వాలిటీపై తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గత వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులపై తీవ్రంగా విమర్శించి, తమ ప్రభుత్వం అత్యుత్తమ నాణ్యతతో బ్యాగులు అందిస్తుందని అసెంబ్లీ సాక్షి (Assembly Presence)గా ప్రకటించారు. అయితే, కొత్తగా పంపిణీ చేసిన బ్యాగులు కేవలం నెల రోజుల్లోనే చినిగిపోవడంతో, లోకేష్ వ్యాఖ్యలను ప్రతిపక్ష వైసీపీ ట్రోల్ చేస్తోంది. నెలరోజులకు చినిగిపోవడే మీ నాణ్యతా అని ప్రశ్నిస్తున్నారు. పేద విద్యార్థులకు అందించే ఫుడ్‌లో నాణ్యత లేదు.. అందించిన బ్యాగుల్లో కూడా నాణ్యత లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. “గత ప్రభుత్వ బ్యాగులు మూడేళ్లు నడిచాయి, కానీ కూటమి బ్యాగులు నెల కూడా నిలవలేదు” అని కామెంట్స్ చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా (Anakapalli District) నక్కపల్లి (Nakkapalli) బాలికల హాస్టల్ (Girls Hostel) సందర్శన సమయంలో హోంమంత్రి (Home Minister)కి వడ్డించిన భోజనంలో బొద్దింక (Cockroach) వీడియోలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాగా, ఈ ఘటన జరిగిన రెండ్రోజుల తరువాత శ్రీకాళహస్తి (Srikalahasti)లో జెర్రి (Centipede) పడిన ఉప్మా తిని ముగ్గురు విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మంత్రి సవిత ఇలాకాలోని సోమందేపల్లి మండలంలో కస్తూర్బా బాలికల హాస్టల్‌లో కల్తీ ఆహారం తిని ఏకంగా 70 మంది అస్వస్థతకు గురవ్వగా, వారికి గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్‌లోనే నేలపై పడుకోబెట్టి వైద్యం అందిస్తుండడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా.. సంబంధిత శాఖ మంత్రి నుంచి స్పందన లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు, విద్యా హక్కుల కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి, నాణ్యమైన బ్యాగులను, క్వాలిటీ ఫుడ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. “పిల్లల ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం, నాణ్యతలేని బ్యాగులతో వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది” అని ఆరోపించారు. అయితే ఈ ఘటన రాష్ట్ర విద్యా శాఖ నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా కఠిన నాణ్యత పరీక్షలు, పారదర్శకమైన సరఫరా విధానాలు అవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నెల రోజులు కాకముందే టైలర్ షాపులకి చేరిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగులు..@naralokesh గారు మీ కక్కుర్తి తో పిల్లల్ని టైలర్ షాప్స్ చుట్టూ తిప్పుతున్నారు.. pic.twitter.com/GSpIjsjjYl
— VenkataReddy karmuru (@Venkat_karmuru) July 4, 2025
కలుషిత ఆహారం.. 20 మంది బాలికలకు అస్వస్థత@MinisterSavitha నియోజకవర్గంలో ఘటన
— Telugu Feed (@Telugufeedsite) July 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం
కలుషిత ఆహారం తిని 20 మందికి అస్వస్థత.. విద్యార్థులకు వాంతులు, విరేచనాలు
గుట్టుచప్పుడు… https://t.co/qgmQs7sxWZ pic.twitter.com/XaVDQ5V7UD








