ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా పరిశ్రమ (Film Industry)పై తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. థియేటర్ల నిర్వహణ మరియు ధరల నియంత్రణపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్. రాష్ట్రంలో సినిమా హాళ్ల బంద్ (Cinema Halls Shutdown) నిర్ణయం, టిక్కెట్ ధరలు (Ticket Prices), పాప్‌కార్న్ (Popcorn), కూల్ డ్రింక్స్ (Cool Drinks), వాటర్ బాటిళ్ల (Water Bottles) ధరలపై విచారణ (Inquiry) జరపాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో, ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ముఖ్యంగా గతంలో సినిమా టిక్కెట్ ధరల నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈ చర్యలు ఉన్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. నాడు సీఎంగా జగన్ చేసి ఆదేశాలను తప్పుబట్టిన పవన్.. నేడు అదే సినీ పరిశ్రమపై ఆదేశాలివ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ మంత్రికి మరో మంత్రి ఆదేశాలా?
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్.. టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ (Cinematography) మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మరియు హోం మంత్రులు లేకుండానే ఆయన ఈ ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా మారింది. సినిమా హాళ్లలో ఆహార పదార్థాలు మరియు పానీయాల ధరలు అధికంగా ఉన్నాయని, వాటిని నియంత్రించాలని ఆయన ఆదేశించారు. వేరొక శాఖకు మంత్రిగా ఉన్న పవన్.. సినిమాటోగ్రఫీ మంత్రికి ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. దుర్గేష్ కూడా జనసేన మంత్రి కావడంతోనే ఆదేశాలిచ్చారని అంటున్నారు.
‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ విడుదలకు ముందు కొంతమంది థియేటర్ యజమానులు జూన్ 1 నుండి సినిమా హాళ్లను మూసివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందిస్తూ, ఈ నిర్ణయం వెనుక కార్టెల్ ఏర్పాటు అనుమానంపై విచారణ జరపాలని హోం శాఖ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. ఈ చర్యలు సినిమా పరిశ్రమపై కక్ష సాధింపుగా కనిపిస్తున్నాయని, అదే సమయంలో ఆయన శాఖకు సంబంధం లేని అంశాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.
పవన్ కళ్యాణ్ కార్యాలయం మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, సినిమా టిక్కెట్ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా నిర్మాతలు కాకుండా, ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తన సినిమా ‘హరిహర వీరమల్లు’కు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సమగ్ర ఫిలిం డెవలప్‌మెంట్ పాలసీని రూపొందించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అయితే, ఈ చర్యలపై పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాడు అలా..నేడు మరోలా..
గతంలో, వైసీపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను నియంత్రించినప్పుడు, పవన్ కళ్యాణ్ దానిని తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. “టాలీవుడ్‌లో చిత్రీకరించే అన్ని సినిమాలు ఒకేలా చూడాలని, చిన్న సినిమాలను కూడా బతికించాలని గత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దీన్ని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ రాజకీయాలకు సంబంధం లేదని, సినిమాపై ప్రభుత్వానికి ఏం సంబంధమంటూ అప్పట్లో అతని అల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్‌లో బహిరంగంగా కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కావడంతో తనకు లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని పెత్తనం చెలాయించడం, ఆదేశాలివ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జనసేన నేత సస్పెండ్..
కాగా, సినిమా థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక జనసేన నేత అత్తి సత్యనారాయణ (Atti Satyanarayana) ఉన్నట్లు నిన్న దిల్ రాజ్ (Dil Raju) సంచలన ఆరోపణలు చేయడంతో పవన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వెంటనే నివారణ చర్యలు చేపడుతూ..రాజమండ్రి ఇన్‌చార్జ్ అత్తి సత్యనారాయణ సభ్యత్వం రద్దు చేస్తూ జనసేన కేంద్ర కార్యాలయం హడావుడిగా ఓ ప్రకటన విడుదల చేయడం సినీవర్గాలను విస్మయానికి గురి చేసింది. తప్పంతా జనసేననే చేస్తూ ఇతరులపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అంటూ సినీ పెద్దలు మండిపడుతున్నారు. ఇదేం నీతి పవన్ అంటూ సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
థియేటర్లు బంద్ నిర్ణయం తీసుకున్న జనసేన నేత సత్యనారాయణను సస్పెండ్ చేసిన @JanaSenaParty అధిష్టానం#AndhraPradesh #PawanKalyan #APTheaters #CinemaTheaters #TicketPrices pic.twitter.com/B18p4VTeWm
— Telugu Feed (@Telugufeedsite) May 27, 2025








