ఓబుళాపురం గనుల కేసులో సంచలన తీర్పు

ఓబుళాపురం గనుల కేసులో సంచలన తీర్పు

ఓబుళాపురం (Obulapuram) మైనింగ్ కేసు (Mining Case)లో నాంప‌ల్లి కోర్టు (Nampally Court) మంగ‌ళ‌వారం కీలక తీర్పును వెల్ల‌డించింది. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)కి కోర్టు భారీ ఊరటను (Relief) కలిగించింది. ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. అయితే ఇదే కేసులో పలువురిని దోషులుగా కోర్టు తేల్చింది.

దోషులుగా తేలినవారిలో గనుల వ్యాపారంతో సంబంధాలున్న ప్రముఖులు ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జనార్దన్ రెడ్డికి చెందిన PA, రాజగోపాల్, అలీఖాన్‌ల‌ను కోర్టు తప్పు చేసినట్లుగా కోర్టు నిర్దారించింది. మరోవైపు సబితతో పాటు మరో వ్యక్తి కృపానందంను సీబీఐ కోర్టు (CBI Court) నిర్దోషిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.

గమనించాల్సిన విషయం ఏంటంటే, 2004 నుండి 2009 మధ్యకాలంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ (Mines Department) మంత్రిగా పనిచేశారు. ఆమె మంత్రిగా ప‌నిచేసిన టెన్యూర్‌లో చోటు చేసుకున్న అనేక అనుమతులపై అనుమానాలు వ్య‌క్తం అవ్వ‌డంతో ఈ కేసులో ఆమెను ఏ8గా చేర్చారు. అయితే కోర్టు తీర్పు ఆమెకు మానసికంగా, రాజకీయంగా ఊరటనిచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment