టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లకు సన్నద్ధమవుతున్నారు. ‘వార్ 2’ (War) 2 సినిమా కోసం విరామం తీసుకున్న తారక్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రాబోయే చిత్రం కోసం మళ్ళీ వర్కవుట్స్ ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారని, అయితే కొన్ని కీలక సన్నివేశాల కోసం మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ అమెరికా (America)లో జరగనున్న నేపథ్యంలో, ఈ చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ అమెరికా కాన్సులేట్ (America Consulate)ను సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ (Laura Williams) తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను కాన్సులేట్‌కు ఆహ్వానించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు నీల్ తన సినిమాలో ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారో చూడడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.







